ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 14, 2020, 6:25 PM IST

ETV Bharat / state

ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తే.. మాపైనే దాడులా?: ఎమ్మార్పీఎస్

కృష్ణా జిల్లా విజయవాడలో ఏపీ ఎమ్మార్పీఎస్ 13 జిల్లాల ప్రతినిధులతో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క అవకాశం కోరితే ఇచ్చామని.. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయని నేతలు మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఏపీ ఎమ్మార్పీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తే.. మాపైనే దాడులా : ఎమ్మార్పీఎస్
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తే.. మాపైనే దాడులా : ఎమ్మార్పీఎస్

విజయవాడలో ఏపీ ఎమ్మార్పీఎస్ ప్రతినిధుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ప్రధానంగా వర్గీకరణ అంశం, ఎస్సీ ఎస్టీ వర్గాలపై దాడులు, సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు, కార్పొరేషన్​లకు నిధులు కేటాయించకపోవడంపై చర్చించి కార్యాచరణ రూపొందించామన్నారు.

వర్గీకరణకు కృషి చేయాలి..

ఎస్సీ వర్గీకరణకు సీఎం కృషి చేయాలని, సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించరాదని సూచించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్నో హక్కులను కాలరాశారు..

రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు ప్రసాదించిన ఎన్నో హక్కులను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రద్దు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ నుంచి 13 జిల్లాల్లో చైతన్య సదస్సులు నిర్వహించి ఛలో విజయవాడ కార్యక్రమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

బలపడి.. మళ్లీ వాయుగుండంగా..!

ABOUT THE AUTHOR

...view details