ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ స్ఫూర్తితో రాష్ట్రం గ్రామ స్వరాజ్యం వైపు పయనిస్తోంది: అంజాద్ బాషా - గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను స్థాపించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ బీఆర్టీస్ రోడ్డులో థ్యాంక్యు సీఎం కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలో అవినీతి రహిత పాలనకు అడుగులు పడ్డాయని ఉప ముఖ్యమంత్రి , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా వెల్లడించారు.

గాంధీజీ కలలు సాకారం ఏపీ : డిప్యూటీ సీఎం అంజద్ బాషా
గాంధీజీ కలలు సాకారం ఏపీ : డిప్యూటీ సీఎం అంజద్ బాషా

By

Published : Oct 3, 2020, 9:11 AM IST

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏడాది వార్షికోత్సవం పూర్తి చేసుకున్న నేపథ్యంలో విజయవాడ బీఆర్టీస్ రోడ్డులో థ్యాంక్యు సీఎం కార్యక్రమం నిర్వహించారు.

భారీ చిత్రానికి పాలాభిషేకం..

సీఎం జగన్ 23 అడుగుల భారీ చిత్రపటానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పాలాభిషేకం చేశారు. సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలో అవినీతి రహిత పాలనకు అడుగులు పడ్డాయని అంజాద్ బాష కీర్తించారు.

పేదల ముంగిటికే..

కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పేదల ముంగిటికే పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగానే వాలంటీర్లు సైనికుల్లా పని చేయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో ఏపీ గ్రామ స్వరాజ్యం వైపు పయనిస్తోందన్నారు. గాంధీజీ కలలు సాకారం చేస్తున్న ఏపీ వైపే అన్నిరాష్ట్రాలు చూస్తున్నాయని ఆయన వివరించారు.

ఇవీ చూడండి : అలాంటి వారిని చూసి చప్పట్లు కొట్టాలా...? తెదేపా

ABOUT THE AUTHOR

...view details