ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలలో నీటి కష్టాలు.. ఇబ్బందుల్లో విద్యార్థులు - muncipal corporation school

అక్కడ నాణ్యమైన విద్య ఉంది. మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. కానీ... మౌలిక సదుపాయలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారు. కనీస సౌకర్యలకు నీళ్లు లేక పిల్లలు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు.

నీటి వసతి లేక ఇబ్బందులు

By

Published : Jul 31, 2019, 7:19 PM IST

పాఠశాలలో తాగునీటి కష్టాలు

నవ్యాంధ్ర రాజధాని కొలువై ఉన్న విజయవాడ నడిబొడ్డున... రామలింగేశ్వరనగర్ లో ఉన్న నగరపాలక సంస్థ పాఠశాలలో.. విద్యార్ధులు నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. 150 మంది విద్యార్థులు చదువుతున్న బడిలో తాగడానికి, ఇతర అవసరాకు ప్లాస్టిక్ డబ్బాల్లో నీళ్లు పట్టి వాడుకుంటున్నారు. అవి కూడా సరిపోక అమ్మాయిలు ఇంటికి వెళ్లి రావాల్సి వస్తోంది. అదే పాఠశాల భవనంలో అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నడుపుతున్నారు. ఉన్న ఒక్క మంచినీటి ట్యాంకు పగిలిపోవడం.. సమస్యకు కారణమైంది.

రెండు నెలల నుంచి పాఠశాలలో విద్యార్థులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. స్కూలు పునః ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. స్పందన కరువైంది. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని అంతా కోరుకుంటున్నారు.

ఇదీ చూడండ: గోదావరి పరవళ్లు... పెరుగుతున్న నీటిమట్టం

ABOUT THE AUTHOR

...view details