వరద తాకిడితో మున్నేరు నది నీటి ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. వత్సవాయి మండలం లింగాల వంతెనపై మూడు అడుగుల ఎత్తు వరద నీరు ప్రవహిస్తోంది. జగ్గయ్యపేట వైపు నుంచి తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు వెళ్తే వాహనాలను పెనుగంచిప్రోలు వంతెన మీదుగా మళ్లిస్తున్నారు.
మునేటి కాలువకు గండ్లు
అనాసాగరం వద్ద మునేటి కాలువకు భారీగా గండ్లు పడ్డాయి. దీంతో వందలాది ఎకరాల పంటపొలాలు నీటిలో మునిగిపోయాయి. కాకులపొన్నారం నుంచి శనగపాడు మీదుగా అనాసాగరం ఆయకట్టు ఉంది. ఇప్పటికే రైతులు వెయ్యి ఎకరాలలో వరి నాట్లు వేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మునేటి కాలువలోకి భారీగా వరద చేరుతోంది. దీంతో కాలువకు గండ్లు పడి పంట చేళ్లను వరద ముంచెత్తుతోంది.
ఇదీ చదవండి :ఆగస్టులో చెల్లించాల్సిన వసతి దీవెన సాయం వాయిదా