ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా ప్రకాశం బ్యారేజీలో నీటిమట్లం మళ్లీ పెరిగింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి 84 వేల 484 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు వెల్లడించారు. దిగువకు 60 వేల 910 క్యూసెక్కుల సముద్రంలోకి విడుస్తున్నారు. అలాగే కృష్ణా డెల్టాలోని తూర్పు కాలువలకు 8391 క్యూసెక్కులు, పశ్చిమ కాలువలకు 7226 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్‌కు 203 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 3.07 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ ఉండటంతో ఎగువనుంచి వస్తున్న ప్రవాహాలను యథాతథంగా దిగువకు వదులుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
PRAKASAM BARRAGE: ప్రకాశం బ్యారేజీ వద్ల మళ్లీ పెరిగిన నీటిమట్టం - శ్రీశైలం డ్యాం
ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీ వద్ల మళ్లీ పెరిగిన నీటిమట్టం
శ్రీశైలంలో 215 టీఎంసీల పూర్తి స్థాయి నీటిమట్టం, నాగార్జునసాగర్‌లో 310 టీఎంసీలతో 99 శాతం మేర నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పులిచింతల వద్ద 32.88 టీఎంసీల నీటి నిల్వ ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి : FIBERNET CASE: సాంబశివరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు