రోజువారీ ఇంటి సంరక్షకుడి స్థానంలో వచ్చిన ఓ దుండగుడు వృద్ధ దంపతులపై దాడి చేసి నగదు, బంగారంతో పరారయ్యాడు. ఈ ఘటనలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం దంట్లగుంటలో నివసించే కొల్లి వెంకటప్పయ్య, వసుమతి అనే దంపతులు గాయాలపాలయ్యారు.
ఇటీవల వెంకటప్పయ్యకు పక్షవాతం రాగా.. విజయవాడలోని ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా ఇంటి సంరక్షణ కోసం వ్యక్తిని కుదుర్చుకున్నారు. అతని స్థానంలో వచ్చిన కొత్త వ్యక్తి దాడి చేయగా.. వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.