కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో ఘన వ్యర్థ కేంద్రాలను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఘన వ్యర్థ కేంద్రాలను ప్రారంభించడంతోపాటు వాటి నిర్వహణను నిబద్ధతతో చేయాలని డీపీవోకు సూచించారు. నిర్వహణకు నోచుకోని కేంద్రాలను గుర్తించి లోపాలను సరిచేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. రానున్న రోజుల్లో అన్ని కేంద్రాల్లో చెత్త నుంచి సంపద సృష్టించాలని అధికారులను ఆదేశించారు.
'ఘన వ్యర్థ కేంద్రాలను నిబద్ధతతో నిర్వహించాలి' - krishna
చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా మారుతాయని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వ్యాఖ్యనించారు. ఘన వ్యర్థ కేంద్రాలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు.
'ఘన వ్యర్థ కేంద్రాలను నిబద్ధతతో నిర్వహించాలి'