కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వార్డు వాలంటీర్ చైన్ స్నాచర్‌గా మారాడు. వృద్ధురాలిని మాటల్లో పెట్టి మెల్లో గొలుసు ఎత్తుకెళ్లాడు. జగ్గయ్యపేటలోని ఆకులవారి వీధికి చెందిన వార్డు వాలంటీర్ నరేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. వృద్ధురాలిని ఆధార్‌కార్డు తీసుకురమ్మని.. ఆమె లోనికి వెళ్తుండగా మెడలో బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వార్డు వాలంటీర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
వార్డు వాలంటీర్... దొంగగా మారాడు - వార్డు వాలంటీర్ దొంగగా మారాడు
ప్రజలకు సేవ చేయవలసినవాడే దొంగలా మారాడు. ప్రభుత్వ పథకాలు చేరువ చేయవలసిన వ్యక్తే పథకమేసి చోరీకి పాల్పడ్డాడు. కృష్టాజిల్లా జగ్గయ్యపేటలో వార్డు వాలంటీర్ చైన్ స్నాచర్‌గా మారాడు.
వార్డు వాలంటీర్ దొంగగా మారాడు