వక్ఫ్‌బోర్డు భూములు అన్యాక్రాంతంకాకుండా చూడాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా..... మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వివాదస్పద భూములపై.. డ్రోన్ కెమెరాల టెక్నాలజీని ఉపయోగించి సర్వే చేపట్టాలన్నారు. సర్వే చేసిన భూముల వివరాలను ఏపీ గెజిట్ పరిధిలోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. వక్ఫ్ బోర్డు కాంప్లెక్స్ గదుల అద్దెలను పెంచేందుకు రాష్ట్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న వక్ఫ్ బోర్డు భూములు.. గతంలో నిషేధించిన భూముల్లో ఎలాంటి అమ్మకాలు, కోనుగోళ్లు జరగకుండా చూడాలన్నారు. రాష్ట్ర విభజన అనంతరం..ఏపీకి రావాల్సిన బకాయిలు, రికార్డులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, తెలంగాణ మైనార్టీశాఖ కార్యదర్శితో సంప్రదించి.. చర్యలు తీసుకోవాలని అంజాద్ భాషా ఆదేశించారు.
వక్ఫ్‌బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: ఉప ముఖ్యమంత్రి - విజయవాడ వార్తలు
రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు భూములపై ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అధికారులతో చర్చించారు. ఆదాయ వనరులు పెంచేందుకు, ఆస్తుల అన్యాక్రాంతాన్ని నిర్మూలించేందుకు తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.
బోర్డు భూములపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష... డ్రోన్ సర్వేకు ఆదేశం