ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇప్పటికైనా వక్ఫ్​బోర్డు సభ్యులను ఎన్నుకోవాలి' - vijayawada

వైకాపా ప్రభుత్వం వక్ఫ్​బోర్డులో ప్రస్తుతం ఉన్న సభ్యులు మినహా మిగతావారితో నూతన కమిటీ ఎన్నుకోవాలని సభ్యులు తెలిపారు.

వక్ఫ్​బోర్డు

By

Published : Aug 9, 2019, 11:50 PM IST

జగన్​ ఇప్పటికైనా వక్ఫ్​బోర్డు సభ్యులను ఎన్నుకోవాలి

గత ప్రభుత్వం 9 మంది సభ్యులతో వక్ఫ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసిందని.. నూతన ప్రభుత్వం కమిటీ ని రద్దు చేస్తూ ఇచ్చిన జీవో 38ను నిలుపుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వటంపై వక్ఫ్ బోర్డు సభ్యులు షేర్వాణీ స్పందించారు. రాజీనామా చేసిన సభ్యులు మినహా... 4 సభ్యులు కోర్టు ఆదేశానుసారం కొనసాగవచ్చని స్పష్టంగా చెప్పిందన్నారు. వక్ఫ్ బోర్డు కు ప్రత్యేకాధికారిగా యూసుఫ్ షెరీఫ్ నియామకంపై కోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చిందని, ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా ప్రత్యేక అధికారిగా వచ్చినందునే అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రస్తుతమున్న సభ్యులు మినహా.. మిగతావారితో నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. నూతన కమిటీ ఏర్పాటుతో వక్ఫ్ సేవలను విస్తృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details