ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో వాకర్స్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానోత్సనం - Walkers International Award Ceremony in Vijayawada newsupdates

విజయవాడలో వాకర్స్​ ఇంటర్నేషనల్​  వార్షిక అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ..సమాజాభివృద్ధికి ఆకాశ్ ఇంటర్నేషనల్ చేస్తున్న కృషిని కొనియాడారు.

Walkers International Award Ceremony in Vijayawada
విజయవాడలో వాకర్స్ ఇంటర్నేషనల్  అవార్డు ప్రదానోత్సనం

By

Published : Dec 29, 2019, 9:31 PM IST

విజయవాడలో వాకర్స్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానోత్సనం

కృష్ణాజిల్లా విజయవాడలో వాకర్స్​ ఇంటర్నేషనల్​ వార్షిక అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. సినీ నటుడు ఆలీ, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఎంత డబ్బు సంపాదించినా మన వెంట ఉండదని..ఆరోగ్యం మాత్రమే మనతో పాటు ఉంటుందని అలీ అన్నారు. చరవాణిల మధ్య మనుషులు బతుకుతున్నారని..మనుషుల మధ్య బాంధవ్యాలను మరిచిపోతున్నారని అన్నారు. వాటివల్ల ఉపయోగం తక్కువ..నష్టం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సమాజాభివృద్ధికి ఆకాశ్ ఇంటర్నేషనల్ చేస్తున్న కృషిని కొనియాడారు. సేవ చేస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డులు అందజేయటం అభినందనీయమన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details