కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు.. జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 2003వ సంవత్సరం నుంచి అందిస్తున్న ఫర్మామెన్స్ లింక్డ్ జనరల్ అలవెన్స్‌ను అర్థాంతరంగా జెన్కో యాజమాన్యం నిలుపుదల చేయటంతో.. ఉద్యోగులు ఆందోళనకు దిగారు. యూనియన్ అసోసియేషన్ సభ్యులను సంప్రదించకుండా.. జెన్కో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అలవెన్సులు నిలుపుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన ఉద్యోగులంతా నష్టపోవాల్సి వస్తోందని జేఏసీ అధ్యక్షుడు మోటుపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమ హక్కులు కాపాడుకోవటానికి జేఏసీ నిర్వహించే పోరాటాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. ఉద్యోగులకు, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. డిస్కంను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ.. దీన్ని అందరూ ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
'జెన్కో ఏకపక్ష నిర్ణయంతో.. అలవెన్సుల నిలిపివేత'
కృష్ణా జిల్లా నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు నిరసనకు దిగారు. జెన్కో యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, అలవెన్సులు నిలిపివేశారని ఆందోళన చేశారు.
ఉద్యోగుల ఆందోళన