ఇష్టపడి చదవండి... ఉన్నత శిఖరాలు అధిరోహించండి...
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలు అందుకోవాలని విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. నగర పాలక సంస్థ పాఠశాలలో పదికి పది జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పదో తరగతి విద్యార్థులకు సన్మానం