ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుర పోలింగ్​కు సర్వం సిద్ధం..

విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్నికల సామగ్రి పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం తర్వాత నుంచి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తమ తమ సామగ్రిని వెంటతీసుకెళ్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటు హక్కు వినియోగం, సిబ్బంది జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రత్యేక కథనం.

By

Published : Mar 9, 2021, 3:24 PM IST

vmc elections arrangements
vmc elections arrangements

విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్నికల సామగ్రి పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తమ తమ సామగ్రిని తీసుకెళ్తున్నారు.

విజయవాడ నగర పాలక ఎన్నికల్లో మొత్తం 32 ప్రత్యేక కేంద్రాల ద్వారా 32 మంది రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల సామగ్రిని డివిజన్ల వారీగా విభజించి పోలింగ్‌, సహాయ పోలింగ్‌ అధికారులకు అందించారు. వారితోపాటు మరో ముగ్గురు సిబ్బంది పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించేలా ప్రొసీడింగ్స్‌ అందించారు. సాయంత్రం లోగా మొత్తం పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

సామగ్రి పంపిణీ చేసే సమయంలో తలెత్తే ఇతరత్రా సమస్యల పరిష్కారానికి వీలుగా.. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అన్ని బూత్‌ల పరిధిలోని ఎన్నికల సామగ్రిని 64 మంది రూట్‌ అధికారుల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య 144 ప్రత్యేక బస్సుల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రంలోగా 788 పోలింగ్‌ బూత్‌లకు చేరేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఎన్నికల విధుల్లో దాదాపు 3,940 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఓటింగ్‌ పూర్తి అయిన అనంతరం నగరంలోని 788 పోలింగ్‌బూత్‌ల పరిధిలోని బ్యాలెట్‌ పెట్టెలను పోలీసుల బందోబస్తు మధ్య లయోలా కళాశాల ప్రాంగణంలోని రెండు స్ట్రాంగ్‌ రూంలకు చేర్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటి నుంచి 39 డివిజన్లకు సంబంధించిన బ్యాలెట్‌ పెట్టెలను ఒక గదిలో, 40 నుంచి 64 డివిజన్లకు చెందిన పెట్టెలను మరో గదిలో భద్రపరుస్తారు.

విజయవాడ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు

ఇదీ చదవండి: స్టీల్​ ప్లాంట్​పై మరోసారి ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

ABOUT THE AUTHOR

...view details