ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విశాఖ స్టీల్ ప్రైవేటీకరణతో.. ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం'

By

Published : Mar 24, 2021, 8:56 PM IST

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణతో... ఎస్సీ, ఎస్టీలకు చెందిన కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాస్ అన్నారు.

విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాస్
విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాస్

జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసినట్టు విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాస్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన కార్మికులకు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణతో అన్యాయం జరుగుతుందని వివరించామన్నారు. కేంద్రం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుందని వారికి తెలిపామని చెప్పారు.

ఇప్పటికే దిల్లీలో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు పలు పార్టీలకు చెందిన ఎంపీలను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్​పై మాట్లాడాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రైవేటీకరణతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని.. నష్టాలను సాకుగా చూపి ప్రైవేటీకరణ చేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

తిరుపతి ఉపఎన్నిక: తెదేపా అభ్యర్థిగా పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు

ABOUT THE AUTHOR

...view details