కృష్ణా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి భోజనం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేటరింగ్ సిబ్బంది అంతా పీపీఈ కిట్లు ధరించి అతిథులకు భోజనం వడ్డించడం చూసి పెళ్లికొచ్చిన వారు ఆశ్చర్యపోయారు.
తొలుత కరోనా రోగుల కోసం వచ్చారేమో అని కొందరు అనుకున్నారు. తర్వాత విషయం తెలుసుకొని నవ్వుకున్నారు. కరోనా కట్టడికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కేటరింగ్ సిబ్బంది తెలిపారు.