విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు..ఆందోళనలో ప్రజలు - 'పెరుగుతోన్న వైరల్ జ్వరాలు'
కృష్ణా జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. కుటుంబంలో ఒకరికి మొదలైతే చాలు.. వరసపెట్టి అందరినీ చుట్టుముడుతున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాల కేసుల సంఖ్య పెరుగుతోంది. కృష్ణా జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పగటిపూట సంచరించే దోమల వల్ల జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి హెచ్చరిస్తున్నారు. జ్వరం తీవ్రతను బట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జ్వరాలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.