సచ్చిదానంద ఆశ్రమంలో ఘనంగా వినాయక చవితి
విజయవాడలో ఉన్న గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమంలో వినాయక చవితి పూజలు ఘనంగా జరిగాయి.గణపతి విగ్రహానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలను మెుదలు పెట్టారు.ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు,పూజా కార్యక్రమాల్లో పాల్గొని,ఆశీర్వాదాలు తీసుకున్నారు.