ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Illegal soil mining: సర్పంచ్ ఆధ్వర్యంలో మట్టి అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న గ్రామస్థులు..! - protest against illegal soil mining

protest against illegal soil mining: కృష్ణా జిల్లా అయ్యంకి గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్థులు ఆందోళన చేశారు. పంచాయతీ చెరువులో మట్టిని ప్రైవేటు స్థలాలకు తరలించడాన్ని టీడీపీ, వైసీపీ నాయకులు కలిసి అడ్డుకున్నారు. అధికారుల ఆదేశాలను లెక్కపెట్టకుండా ప్రైవేటు స్థలాలకు మట్టి తరలిస్తున్నారని మండిపడ్డారు. మట్టి అక్రమార్కులను ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు మోహరించి అడ్డుకున్నారు.

అక్రమ మట్టి తవ్వకాలు
illegal soil mining

By

Published : May 27, 2023, 9:06 PM IST

Updated : May 28, 2023, 6:37 AM IST

అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్థులు ఆందోళన

Protest against illegal soil mining in AP: కృష్ణాజిల్లా మొవ్వ మండలం అయ్యంకిలో ఉద్రిక్తత నెలకొంది. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నేతల మట్టి అక్రమ తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. వైసీపీ సర్పంచ్ వర్గీయులు, గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకొని తెలుగు దేశం పార్టీ నేతలు, వైసీపీ మండల కన్వీనర్ రాజులపాటి రాఘవరావు గ్రామస్థులకు మద్దతు తెలిపారు. ఇరు పార్టీల కార్యకర్తలు అయ్యంకి పంచాయతీ చెరువు వద్దకు చేరుకున్నారు.

సర్పంచ్ పేరు మీద మట్టి తవ్వి జగనన్న కాలనీలకు, పల్లపు రోడ్ల కోసం తరలించాలని తీర్మానం చేశారు. అయితే, సర్పంచ్ మాత్రం జగనన్న కాలనీల పేరుతో గ్రామపంచాయతీ చెరువులో మట్టిని ప్రవేటు స్థలాలకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులు చేస్తున్నఅక్రమ మట్టి తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ చెరువులోని లక్షలాది రూపాయల మట్టిని వైసీపీ వర్గీయులు అక్రమంగా అమ్ముకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయినా.. అధికారులు స్పందించకపోవడం దారుణమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెుదట గ్రామంలోని మౌలిక వసతుల కోసం అనంతరం, మిగిలిన మట్టిని పంచాయతీ ఆదాయం వచ్చేలా చేయాలని గ్రామస్థులు పట్టుబట్టారు. దీంతో సర్పంచ్ వర్గీయులు చెరువులో నుంచి మిషన్లతో సహా బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఇరు పార్టీల నేతలు పంచాయతీ చెరువు వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంత జరుగుతున్న ఏ ఒక్క అధికారి కూడా అటు వైపు కన్నెత్తి చూడకపోవడం టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మట్టిని సైతం వదలకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

'నిన్న ఎమ్మెల్యే గారు మట్టిని తొలవద్దని చెప్పారు. ఎమ్మార్వో సైతం మట్టిని తొలవద్దని చెప్పారు. అయినా నేడు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా అక్రమంగా కాకుండా పంచాయితీ కోసం తోలాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎకరాకు మించిన ప్రదేశంలో మాత్రమే మట్టిని తోలాలి అని అధికారులు చెప్పారు. అయినా మళ్లీ మట్టి తోలుతున్నారు. గతం రూ. 400 ఉండే ట్రాక్టర్ మట్టి.. ఇప్పుడు రూ.1000 అంటున్నారు. మా ఊరిలో నుంచి వేరే గ్రామాలకు మట్టిని తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. ఎమ్మార్వో, ఎస్ఐ ఎవ్వరు స్పందించడం లేదు. జగనన్న కాలనీల పేరుతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. గత మూడు రోజులుగా మట్టి తరలిస్తున్నా ఒక్క అధికారి రావడం లేదు. మట్టి కోసం చెరువులను నాశనం చేస్తున్నారు. అక్రమాలపై జిల్లా కలెక్టర్, మండల అధికారులు, స్పందించాలని కోరుకుంటున్నాం.'- అయ్యంకి, గ్రామస్థులు

ఇవీ చదవండి:

Last Updated : May 28, 2023, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details