ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ ఇంతియాజ్

గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కృష్ణా జిల్లాలో చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజలేటర్లకు తొలివిడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు.

village secretaries exam training in krishna district
కలెక్టర్ ఇంతియాజ్

By

Published : Sep 9, 2020, 10:08 AM IST

కృష్ణా జిల్లాలో ఈనెల 20 నుంచి 26 వరకు జరగనున్న గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ నియామక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజలేటర్లు తదితరులకు నిర్వహించిన తొలివిడత శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరు ప్రారంభించారు. గత ఏడాది జిల్లాలోని 845 గ్రామ, 450 వార్డు సచివాలయాలకు నిర్వహించిన పరీక్షల ద్వారా 9,564 మంది నియమితులయ్యారని... మరో 1425 పోస్టుల భర్తీకి... లక్షా 19 వేల 515 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారని వివరించారు. ఇందుకోసం 550 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details