ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవం'

డిసెంబర్ 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఇదే రోజున గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ సంఘం నిర్ణయించింది.

'డిసెంబర్ 21న గ్రామ,వార్డు సచివాలయ దినోత్సవం'
'డిసెంబర్ 21న గ్రామ,వార్డు సచివాలయ దినోత్సవం'

By

Published : Dec 13, 2020, 10:58 PM IST

విజయవాడలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అసోషియేషన్ కార్యవర్గ ఎన్నిక జరిగింది. సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినమైన డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ సంఘం నిర్ణయించింది. సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాకుండా ప్రభుత్వ సేవలను ప్రజలకు వారి ఇంటి ముందే అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందున ఈ ఉత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పని చేస్తూ యావద్భారతదేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సాక్షాత్తు ప్రధానమంత్రే రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పని చేస్తుందని చెప్పినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. మిగతా రాష్ట్రాలు కూడా దానిని అనుసరించాలని సూచించారని చెప్పారు.

ముఖ్యమంత్రి చేసిన మేలును గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారన్నారు. సరైన సమయంలో వారి కృతజ్ఞతను ప్రభుత్వానికి తెలియజేస్తారన్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంకా రెగ్యులర్ చేయకపోయినా 010 పద్దు కింద జీతాలు ఇస్తున్నారని, మాతృత్వ సెలవులు మంజూరు చేయడం సహ డిపార్ట్​మెంట్​ పరీక్షలలో నెగెటివ్ మార్కులు విధానాన్ని తొలగించారని అన్నారు. కరోనా తగ్గాక లక్ష మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ముఖ్యమంత్రికి సన్మానం చేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి

21న భూముల సమగ్ర సర్వే ప్రారంభించనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details