విజయవాడలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019లో జరిగిన రోడ్డు 95.3 శాతం ప్రమాదాలు జరిగితే.. 97.7 శాతం మరణాలు రేటు నమోదైంది. అంటే ప్రమాదాల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ప్రమాదాల్లో యువతే ఎక్కువగా బలవుతున్నారు. ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదికలోని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 53 నగరాల్లో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో విజయవాడ 2.1 శాతం ఉంది. అత్యధిక ప్రమాదాలు జరిగిన నగరాల జాబితాలో విజయవాడ 15వ స్థానంలో ఉంది. 2018 తో పోలిస్తే 2019 లో విజయవాడలో 9.9 శాతం ప్రమాదాలు తగ్గాయి. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన ' ప్రమాద మరణాలు - ఆత్మహత్యల సమాచార నివేదిక -2019 ' లో వివరాలను వెల్లడించింది.
ఎస్సీఆర్ బీ -2019 నివేదిక ప్రకారం గతేడాది జరిగిన ప్రమాదాల్లో ద్విచక్రవాహనాలకు సంబంధించినవే ఉండగా .. మృత్యువాత పడినవారు వీళ్లే అధికంగా ఉన్నారు. నగరంలో 2019 లో రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 355 మందిలో 201 మంది ద్విచక్రవాహన ప్రమాదాల వల్ల గాయపడగా... 96 మంది మృత్యువాతపడ్డారు. బైక్పై వెళ్లేవారిలో ప్రధానంగా హెల్మెట్ ధరించకపోవడంతో మృత్యువాత పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితుల్లో రహదారుల దయనీయస్థితి కొంత , నిర్లక్ష్యంతో చేజేతులా తెచ్చుకుంటున్న ముప్పు మరికొంత ఉంది. ప్రమాదంలో నివారణలో అధికారులదే పూర్తి బాధ్యత కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించాల్సిందే. నవమాసాలు మోసి , అపురూపంగా పెంచుకున్న బిడ్డను అంతే బాధ్యతతో చూసుకోవాలి. దారి తప్పితే వారించాలి. ప్రస్తుతం ప్రతి ఇంటికి ద్విచక్రవాహనం సర్వసాధారణమైంది . తగిన వయసు, కనీసం అనుభవం లేకపోవడం, ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడంతో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. వాహనం ఇచ్చినప్పుడే తల్లిదండ్రులు ఇవేమీ పరిశీలించకపోయినా.. కనీసం హెల్మెట్ వాడుకునేలా నేర్పించకపోవడం తెలిసి తెలిసి మృత్యువువైపు నడిపిస్తోంది.