ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవినీతి సాకుతో అభివృద్ధిని ఆపేశారు: కోనేరు శ్రీధర్ - koneru sridhar

గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందనే సాకును భూచిగా చూపి.. అభివృద్ధిని ఆపేశారని విజయవాడ మాజీ మేయర్ శ్రీధర్ ఆరోపించారు. జగన్​కు ప్రతిపక్షంపై కక్ష సాధించడంపై ఉన్న శ్రద్ధ... సంక్షేమంపై లేదన్నారు.

నవరత్నాలు

By

Published : Jul 20, 2019, 5:54 PM IST

కోనేరు శ్రీధర్ మీడియా సమావేశం

వైకాపా ప్రభుత్వం వచ్చి 60 రోజులు అవుతున్నా నవరత్నాలు అమలుకు నోచుకోలేదని విజయవాడ మాజీ మేయర్ శ్రీధర్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్​కు చంద్రబాబుపై కక్ష సాధించడంపై ఉన్న శ్రద్ధ... ప్రజా సంక్షేమంపై లేదన్నారు. అవినీతి జరిగిందన్న సాకుతో పేదలకు గృహ పంపిణీని, రాష్ట్రాభివృద్దిని నిలిపివేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, సమ్యలపై దృష్టి సారించకుండా...హైదరాబాద్‌లోని ఆయన ఆస్తులు కాపాడుకోవడానికే జగన్ ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details