నగరంలో గోతులు పడిన రోడ్లని మరమ్మత్తులు చేపట్టాలని విజయవాడ టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సింగ్ నగర్ ప్రధాన కూడలిలో చేపట్టిన ఆందోళనలో రాబోయో కాలంలో వేసే రోడ్లు, డ్రైనేజీలు శాస్త్రీయ పద్ధతిలో నిర్మించాలని కోరారు. వర్షాకాలం వచ్చిందంటే నగరంలోని రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోతుందని, వీటిపై ఎన్నిసార్లు ఆందోళన చేపట్టినా అధికారులు స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో స్థానికులను జాగృతం చేయడానికి ఆందోళనలు చేపట్టినట్లు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.
రోడ్ల కోసం రోడ్డెక్కిన టాక్స్ పేయర్స్ - విజయవాడ టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ధర్నా వార్తలు
విజయవాడ టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సింగ్ నగర్ ప్రధాన కూడలిలో చేపట్టిన ఆందోళనలో రాబోయో కాలంలో వేసే రోడ్లు, డ్రైనేజీలు శాస్త్రీయ పద్దతిలో నిర్మించాలని కోరారు.
రోడ్ల కోసం రోడ్డెక్కిన విజయవాడ టాక్స్ పేయర్స్ అసోసియేషన్