.
'స్వచ్ఛ సర్వేక్షణ్'లో విజయవాడను ముందుంచటమే మా లక్ష్యం' - latst news of vijayawada muncipal corporation
విజయవాడను స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 లో మొదటి స్థానంలో ఉంచే దిశగా నగర పాలక సంస్థ అడుగులు వేస్తోంది. 'స్వచ్ఛ సర్వేక్షణ్'లో నగరానికి మంచి ర్యాంకు సాధించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. విజయవాడ వాసులందరూ స్వచ్ఛ సర్వేక్షణ్ వెబ్సైట్లో తమ అభిప్రాయాలను పంచుకోవాలని కమిషనర్ కోరారు ఈ నెల 31వరకు ఈ కార్యక్రమం తుది గడువు ఉందన్నారు. నగరంలోని ముఖ్యమైన రోడ్లను ప్రత్యేక మిషన్ల ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న విజయవాడ నగర పాలక కమిషనర్