పౌరుల నుంచి ఆన్లైన్లో పన్నులు కట్టించుకోవడంతో విజయవాడ నగరపాలకసంస్థ విఫలమైందని నగరవాసులు ఆరోపించారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గంటలు తరబడి లైన్లలో నిలబడటం వల్ల కరోనా బారిన పడే ప్రమాదం ఉందని పన్ను చెల్లింపుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక దూరం పాటించేందుకు అనువుగా లేని ఇరుకు ప్రదేశాల్లో గంటల తరబడి నిలబడి, పన్నులు కట్టడం ప్రాణసంకటంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. రద్దీని బట్టి కౌంటర్లు ఏర్పాటు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ చెల్లింపులు చేయడంలో ఉన్న సాంకేతిక సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల అలసత్వం.. పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది.. - vijayawada latest news
విజయవాడ నగరపాలక సంస్థ వైఖరిపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలో పన్ను చెల్లించేలా చర్యలు తీసుకోకుండా.. భౌతికంగా పన్నులు చెల్లించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సామాజిక దూరం పాటించేందుకు వీలు లేకుండా క్యూలైన్లలో నిలబడటంతో కరోనా సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
అధికారుల అలసత్వం... పన్ను చెల్లింపుదారులకు ప్రహసనం