విజయవాడలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతుండడంతో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో హాట్ స్పాట్ ప్రాంతాల్లో అకారణంగా బయటకు వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. రోడ్డుపై పట్టుకున్నవారిని.. బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు. సరైన సమాధానం చెప్పని వారిని అప్పటికప్పుడే అంబులెన్స్‌లో ఎక్కించి క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. సోమవారం కృష్ణలంక పరిధిలో సౌత్ ఏసీపీ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీంల ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేశారు. రోడ్డుపైకి వచ్చిన ఏడుగురిని అంబులెన్స్‌లోకి ఎక్కించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. మిగతా రెడ్‌జోన్ ప్రాంతాల్లోనూ పోలీసులు కవాతు నిర్వహిస్తూ హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ సూర్యచంద్రరావు మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించి కృష్ణనదిలోకి తిరుగుతున్న 23 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కృష్ణానదిలో క్రికెట్, పేకాట ఆడితే ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అకారణంగా వస్తే.. క్వారంటైన్కే.. - corona cases in krishna dist updated news
రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతుండడంతో విజయవాడ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో హాట్ స్పాట్ ప్రాంతాల్లో అకారణంగా బయటకు వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
విజయవాడలో మరింత కఠినంగా లాక్డౌన్ అమలు