లోకం తేలియని పసి పిల్లల మోములో చిరు నవ్వులను తెప్పిస్తున్నారు విజయవాడ నగర పోలీసులు. సోల్జర్స్ ఫర్ చిల్డ్రన్ పేరుతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని... కొంత సొమ్ము పొదుపు చేసి పేద చిన్నారుల కోసం ఉపయోగిస్తున్నారు. విజయవాడ నగర పోలీసులు కొందరు సోల్జర్స్ ఫర్ చిల్డ్రన్ పేరుతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా విభిన్న సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.
కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన పంచగడ్డ సంజీవ్ కుమార్కు జన్మించిన నవజాత శిశువు నిమోనియాతో బాధపడుతోంది. ఈ విషయం సామాజిక మాధ్యమాలలో రావటంతో పాపకు సోల్జర్స్ ఫర్ పూర్ చిల్డ్రన్ గ్రూప్ తరుపున 20 వేల రూపాయల ఆర్ధికసాయాన్ని అందించారు. పేదరికంలో ఉండి వివిధ సమస్యలతో బాధపడే చిన్నారులకు తమవంతు ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నామని గ్రూప్ సభ్యులు తెలిపారు. మున్ముందు రోజులలో అనేక సహాయ కార్యక్రమాలు చేయటానికి కార్యచరణ రుపొందించు కుంటున్నామని పేర్కొన్నారు.