విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు విజయవాడ, నున్న గ్రామీణ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గో గ్రీన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాగిత వ్యర్థాలతో తయారు చేసిన పెన్సిళ్లు, పెన్నులు పంపిణీ చేశారు. వీటిపై విజయవాడ నగర పోలీసు వాట్సాప్ నంబరు, ఇతర వివరాలను ముద్రించారు. ఈ పెన్సిళ్లు, పెన్నులను స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నత పాఠశాల విద్యార్థినులకు పంపిణీ చేశారు. నున్న గ్రామీణ సీఐ ప్రభాకరరావు, గో గ్రీన్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. నగర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.
విద్యార్థినుల అప్రమత్తతపై... పోలీసుల అవగాహన - go green organisation
విజయవాడలోని నున్న పోలీసులు, గోగ్రీన్ సంస్థ కలిసి.. స్థానిక పుచ్చల పల్లి సుందరయ్య పాఠశాలలో చేరువ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. విద్యార్థినిల భద్రత, అప్రమత్తతపై నున్న సీఐ ప్రభాకరరావు మాట్లాడారు. నగర పోలీసు వాట్సాప్ నంబరు ఉన్న పెన్సిళ్లు, పెన్నులు విద్యార్థినిలకు అందించారు.
విద్యార్థినిల అప్రమత్తతపై పోలీసుల అవగాహన కార్యక్రమం