కృష్ణా జిల్లా.. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి డీసీపీ హర్షకుమార్ నేతృత్వంలో పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. నగరంలో కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని.. అనవసరంగా బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో 8 ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రకటించారు. అక్కడ రాకపోకలు పూర్తిగా నిషేధించారు. రెడ్ జోన్లలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా.. నిత్యావసర సరకులు కూడా వారి ఇంటికి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఎవరైనా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తే.. క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తామని హెచ్చరించారు.