విభిన్న ప్రతిభావంతులైన కళాకారుల కుటుంబాలకు విజయవాడ వన్ టౌన్ పోలీసులు నిత్యవసర సరకులను ఆదివారం పంపిణీ చేశారు. విజయవాడ నగరంలో వివిధ కూడళ్లలో పాటలు పాడి జీవనం సాగించే అంధ కళాకారుల కుటుంబాలు లాక్ డౌన్ కారణంగా కుటుంబపోషణ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన వన్ టౌన్ పోలుసులు... చందాలు వేసుకుని 5 కుటుంబాలకు రెండు నెలలకి సరిపడా నిత్యవసర సరకులు పంపిణీ చేశారు.
విభిన్న ప్రతిభావంతుల కుటుంబాలకు పోలీసులు నిత్యావసరాలు పంపిణీ - latest news of vijayawada police
వీధులలో పాటలు పాడుకుంటూ పొట్టనింపుకునే కళాకారుల కుటుంబాలకు విజయవాడ వన్ టౌన్ పోలీసులు నిత్యవసర సరుకులు అందించారు. లాక్డౌన్ కారణంగా వారు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ విధంగా సాయం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Vijayawada one town police help road side singers family by providing grossaries