ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ నగరపాలక ఎన్నికల్లో ఓటింగ్ శాతం గందరగోళంపై వివరణ - Vijayawada Municipal Corporation News

కీలకమైన విజయవాడ నగరపాలక ఎన్నికల విషయంలో అధికారులు ఆదినుంచి తడబాటుకు గురయ్యారు. దీని వల్ల ఓటర్లలో అనవసర గందరగోళానికి తావిచ్చారు. నగరపాలక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతంపై నెలకొన్న గందరగోళానికి అధికారులు తాజాగా వివరణ ఇచ్చారు.

విజయవాడ నగరపాలక ఎన్నికల విషయంలో గందరగోళానికి వివరణ
విజయవాడ నగరపాలక ఎన్నికల విషయంలో గందరగోళానికి వివరణ

By

Published : Mar 13, 2021, 4:28 AM IST


విజయవాడ నగరపాలక ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై తలెత్తిన గందరగోళానికి అధికారులు తాజాగా వివరణ ఇచ్చారు. పోలింగ్ సమయానికి ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 7లక్షల 81వేల 883 ప్రకారం..... 59.79 ఓటింగ్ శాతం నమోదైందని తొలుత వెల్లడించారు. ఎస్​ఈసీ కార్యాలయ అనుమతితో ముందుగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో 40వేల 120 డూప్లికేట్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించినందున..... ఆ నిష్పత్తి ప్రకారం పోలింగ్ శాతం 63.02గా ప్రకటించినట్టు తెలిపారు. మొత్తం పోలైన ఓట్లు 4లక్షల67వేల487లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు

ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాల మార్పు, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్‌ శాతం.. ఇలా అనేక అంశాల్లో స్పష్టత కొరవడింది. నగరంలోని పలు పోలింగ్‌ కేంద్రాల చిరునామాలను మార్చేశారు. గత ఏడాది నామినేషన్లు స్వీకరించిన సమయంలో మారిన పోలింగ్‌ కేంద్రాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. వారం రోజుల ముందు హడావుడిగా పోలింగ్‌ కేంద్రాలను మార్చేశారు. భవానీపురం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పబ్లిక్‌ స్కూల్లోని పోలింగ్‌ కేంద్రాన్ని ఆర్టీసి వర్కుషాపు రోడ్డు రవీంద్రభారతి స్కూల్‌కు మార్చారు. ఆర్టీసీ వర్కుషాపు రోడ్డులోని అన్న క్యాంటీన్‌ భవనంలోకి కూడా కొన్ని బూత్‌లను మర్చారు. నగరంలోని ఓటర్ల జాబితా సరవణ ప్రక్రియ సజావుగా సాగలేదు. పలువురు ఓటర్లు మరణించగా, వారి పేర్లు జాబితాలోనే ఉంచారు. కొందరు నగరం విడిచి వెళ్లిపోగా, మరికొందరు విదేశాల్లో ఉంటున్నారు. అటువంటివారు 40వేలకు పైగా ఉన్నారు. వారిని ముందుగానే తొలగించి జాబితాను సవరించలేదు.

గత ఏడాది మార్చిలో అభ్యర్థుల నుంచి నామపత్రాలను స్వీకరించారు. ఈ దఫా మార్చి 2,3 తేదీల్లో అభ్యర్థుల ఉపసంహకరణతో ప్రక్రియ తిరిగి మొదలైంది. ముందుగా 801 మంది అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయగా, 733 మంది అభ్యర్థుల నామినేషన్ల సక్రమమైనవిగా తేల్చారు. నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ అనంతరం 348 మంది బరిలో ఉన్నట్లు ప్రకటించారు. వారికి గుర్తుల కేటాయింపు, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియ ప్రారంభించారు. అయితే 27వ డివిజన్‌ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి ఒకరు మరణించారు. అభ్యర్థి పేరు తొలగించకుండానే బ్యాలెట్‌ పత్రాలు సిద్ధం అవుతుండగా ఆఖరి నిముషయంలో గుర్తించి...., సవరణ జాబితా విడుదల చేశారు. పోలింగ్‌ పూర్తి అయిన అనంతరం బ్యాలెట్‌ బ్యాక్సులకు సీల్‌ వేసి తరలించాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 28వ డివిజన్‌లోని రెండు కేంద్రాల్లో ఖాళీ పెట్టెలకూ సీళ్లు వేశారు. దీనిపై రగడ జరిగింది. 23వ డివిజన్‌లోని కర్నాటి రామ్మోహనరావు పాఠశాల కేంద్రంలోని ఓ పెట్టకు సీలు వేయకుండానే స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. తరువాత స్ట్రాంగ్‌రూం వద్ద అభ్యర్థుల సమక్షంతో తిరిగి సీళ్లు వేశారు. రేపు చేపట్టే లెక్కింపులోనైనా తడబాట్లకు తావులేకుండా వ్యవహరిస్తారా లేదో అన్నది వేచి చూడాలి.

ఇవీ చదవండి

పింగళికి భారతరత్న ప్రకటించడం సముచితం: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details