ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చదవింది బీటెక్... చేసేది డ్రగ్స్ వ్యాపారం! - vijayawada drugs case accused

అతడు బీటెక్ చదివిన వాడు. అక్కడ ఉన్న పరిచయాలతో డ్రగ్స్ అమ్మటం మెుదలుపెట్టాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇదీ.. విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కోనేరు అర్జున్ కథ.

drugs case accused arrest
విజయవాడ డ్రగ్స్ కేసు నిందితులు అరెస్ట్

By

Published : Jul 16, 2020, 3:01 PM IST

విజయవాడ డ్రగ్స్ కేసు విషయంలో పోలీసులు ఇద్దరు విదేశీయులను, పెనమలూరుకు చెందిన కోనేరు అర్జన్​ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో విదేశీయులు అరెస్టు కావటం విజయవాడలో ఇది రెండోసారి. సుడాన్​కు చెందిన రసూల్, టాంజానియాకు చెందిన యోనా నుంచి మత్తు పదార్థాలు కొనుగోలు చేసిన అర్జున్.. విజయవాడలో ఇంజినీరంగ్ విద్యార్థులకు అమ్మేవాడని పోలీసులు వివరించారు.

విక్రయంలో కీలక నిందితుడిగా ఉన్న కోనేరు అర్జున్ బీటెక్ చదివిన రోజుల్లో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని.. డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిపారు. అర్జున్ నుంచి ఎవరెవరు మత్తు పదార్థాలు కొనుగోలు చేశారో అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన విదేశీయుల పాస్​పోర్టులు సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details