శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరాస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండ దిగువన అన్నదాన భవనం వద్ద టైమ్ స్లాట్ పద్దతిలో ఆధార్ కార్డు చూసి భక్తులకు టికెట్లు జారీ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రతి గంటకు టైమ్ స్లాట్ పద్దతిలో కేటాయించిన టికెట్లు అయిపోగానే మరలా టికెట్లు ఇవ్వడానికి కొంత సమయం పడుతుండటంతో క్యూలైన్లు భక్తులతో నిండిపోవటంతో రోడ్డు పైనే గుంపులుగా వేచి ఉన్నారు. ఓక పక్క కరోనా మహమ్మరి కరాళనృత్యం చేస్తున్నా..మరో పక్క భక్తులందరూ ఒక్కచోటే గుంపులుగా చేరటం..., క్యూలో మనిషికి మనిషికి మధ్య కనీసం దూరం పాటించే వీలు లేకపోవడంతో ఏ మాత్రం భౌతికదూరం పాటించకుండా ఒకరిని ఒకరూ తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
శ్రావణ శుక్రవారం.. కిక్కిరిసిన విజయవాడ దుర్గమ్మ ఆలయం - rush at vijayawada temple
విజయవాడ దుర్గమ్మ ఆలయం శ్రావణ మాసం మెుదటి శుక్రవారం కారణంగా కిటకిటలాడింది. టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. కరోనా సమయంలో కూడా... భౌతిక దూరం పాటించటానికి వీల్లేనంతగా క్యూలైన్టలో కిక్కిరిసి.. దర్శనం కోసం వేచి చూశారు.
కిక్కిరిసిన విజయవాడ దుర్గమ్మ ఆలయం