విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి గోశాలలో ఒకేసారి 86 గోవులు మృతిచెందిన సంఘటనపై విచారణ కొనసాగుతోంది. దీనిలోభాగంగా విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమల రావు గోశాలను సందర్శించారు. గోవుల మృతి తీరు అనుమానాస్పదంగానే ఉందని తెలిపారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న... గోవులు ఒకేసారి చనిపోవడం పట్ల సందేహం కలుగుతోందని చెప్పారు. కొన్ని ఆవులకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని, ఆ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి ఓ క్లారిటీ వస్తుందన్నారు.
'గోవుల మృతిపై అనుమానాలున్నాయి... విచారిస్తున్నాం' - cows death
గోవుల మృతిపై అనుమానాలు ఉన్నాయని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గోశాలను ఆయన పరిశీలించారు.
!['గోవుల మృతిపై అనుమానాలున్నాయి... విచారిస్తున్నాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4101297-504-4101297-1565453910000.jpg)
'గోవుల మృతిపై అనుమానాలున్నాయి... విచారిస్తున్నాం'
'గోవుల మృతిపై అనుమానాలున్నాయి... విచారిస్తున్నాం'
ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే..
గోశాలలో ఆవుల మృతిపై పశుసంవర్థకశాఖ జేడీస్పందించారు. బ్లాట్ వల్లే ఆవులు చనిపోయాయని భావిస్తున్నామని.. ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవరకు కచ్చితమైన నిర్ధరణకు రాలేమన్నారు. విష ప్రయోగం జరిగిందా ? లేదా ? అనేది ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే తేలుతుందన్నారు.
Last Updated : Aug 10, 2019, 10:10 PM IST