విజయవాడ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా... వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి లేదని నగర సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. తమ తమ ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఊరేగింపులు, నిమజ్జనాలు చేసుకోవడానికి అనుమతి లేదన్న సీపీ... ఆలయాల్లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హత్యాయత్నం కేసులో సిబ్బందిపై చర్యలు
నగరంలో సంచలనం రేపిన సజీవదహనం యత్నం కేసులో పోలీసు సిబ్బందిపై సీపీ చర్యలు తీసుకున్నారు. నిందితులకు పోలీసు సిబ్బంది సహాయం చేశారనే ఆరోపణలు రావడంతో ఓ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఐదుగురు పోలీసులకు ఛార్జ్ మెమోలు ఇచ్చినట్లు సీపీ తెలిపారు. ఇటీవల నగరంలో నోవాటెల్ సమీపంలో నిందితుడు వేణుగోపాలరెడ్డి.. ముగ్గురు వ్యక్తులపై పెట్రోలు పోసి చంపేందుకు యత్నించారు.