ఓ కేసు నేరపరిశోధనలో తమకు సహకరించనందుకు బ్యాంకు అధికారులకు పోలీసులు నోటీసులు పంపారు.విజయవాడ భవానీపురానికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకుని అందులోని నగదును మరో ఖాతాకు మళ్లించగా...ఆ నగదు ఐడీఎస్సీ బ్యాంక్ ఖాతాకు వెళ్లాయని బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు.దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని సదరు బ్యాంక్ అధికారులకు పోలీసులు లెటర్ రాసినా పట్టించుకోనందున తాము ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఓ బ్యాంక్ అధికారులకు పోలీసులు నోటీసులు - విజయవాడలో ఓ బ్యాంక్ అధికారులకు పోలీసులు నోటీసులు
విజయవాడలో.. ఓ బ్యాంక్ అధికారులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక కేసు నేరపరిశోధనలో సహకరించనందుకు ఈ నోటీసులు జారీ చేశారు.
![ఓ బ్యాంక్ అధికారులకు పోలీసులు నోటీసులు vijayawada-city-police-notice-to-bank-officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5408977-thumbnail-3x2-police.jpg)
vijayawada-city-police-notice-to-bank-officers