మూడున్నర కోట్ల వివాదం.. ముగ్గురి ప్రాణం.. - విజయవాడ కారు దగ్ధం ఘటనపై వార్తలు

13:51 August 18
విజయవాడ: కారు తగలబెట్టిన ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు
కారులో వ్యక్తులు ఉండగానే... దాన్ని తగలబెట్టిన కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంగాధర్ దంపతులు, కృష్ణారెడ్డి.. వేణుగోపాల్‌రెడ్డికి మూడున్నర కోట్ల వరకూ బకాయి పడ్డారని విజయవాడ పోలీసులు గుర్తించారు. డబ్బులు ఇవ్వట్లేదని ఆగ్రహించిన వేణుగోపాల్‌రెడ్డి.. కారులో వాళ్లు ముగ్గురూ ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనకు మొత్తం మీద రూ.10కోట్ల వరకూ అప్పులు ఉండటంతో వేణుగోపాల్‌రెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని... దీంతో పథకం ప్రకారమే హత్యకు యత్నించాడని పోలీసులు నిర్ధరించారు. మైలవరంలో 2014 నుంచి వేణుగోపాల్‌రెడ్డి.. భూ లావాదేవీలు, కార్ల అమ్మకాల వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వేణుగోపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్‌పై ఎందుకు విచారణ చేయకూడదు?