తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల భద్రత పట్ల ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని... విజయవాడకు చెందిన రమేష్ దంపతులు ఆరోపించారు. కొండపైన ఉండే ఉప ఆలయాల్లో ఒకటైన వరాహ నరసింహస్వామి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్న వాళ్లందరినీ సిబ్బంది ముందుకు రమ్మనగా.. దంపతులు వెళ్లారు. అనంతరం లోపలికి అనుమతించారు. తాము లోపలకి వెళ్లడానికి ప్రయత్నించగా... సిబ్బంది చూసుకోకుండా ఒక్కసారిగా గేటు మూసివేశారని రమేష్ తెలిపారు. తమ కుమారుడు కృష్ణదీప్ కుడిచేతి ఉంగరపు వేలు తెగిపోయిందని వాపోయారు. ఈ ఘటనపై తితిదే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చిన్నారిని హుటాహుటిన దేవస్థానానికి సంబంధించిన ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. అక్కడా... సిబ్బంది స్పందించని కారణంగా... ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించారు. భక్తుల పట్ల కనికరం లేకుండా సిబ్బంది వ్యవహరిస్తే చర్యలు చేపట్టరా... అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
తితిదే సిబ్బంది నిర్లక్ష్యం.. తెగిన బాలుడి వేలు - కృష్ణదీప్
తితిదే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విజయవాడకు చెందిన బాలుడు కృష్ణదీప్ కుడిచేతి ఉంగరపు వేలు తెగిపోయింది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
తితిదే సిబ్బంది నిర్లక్ష్యంపై... భక్తుల ఆవేదన