కృష్ణా జిల్లాలోని విజయవాడలో పన్నుల మీద 27 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు ధ్వజమెత్తారు. చెత్త మీద పన్ను వేయడం దుర్మార్గమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు.
బెజవాడను ఆదాయ వనరుగానే..
వైకాపా ప్రభుత్వం విజయవాడ నగర పాలక సంస్థను ఒక ఆదాయ వనరుగా చూస్తోందన్నారు. ఇంటి పన్నులోనే అన్ని రకాల ట్యాక్స్‌లు ఉంటాయని.. మళ్లీ చెత్తపై పన్ను వేయడం ఏమిటని బాబురావు ప్రశ్నించారు. చెత్తపై పన్ను వసూలు ఫిబ్రవరి కౌన్సిల్లో తీర్మానం చేసినట్లు అధికారులు చెబుతున్నారని.. ఫిబ్రవరిలో అసలు కౌన్సిల్ ఎక్కడ ఉందని నిలదీశారు.