విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలలో... 8వ డివిజన్లోని ఓటర్లపై వైకాపా అభ్యర్థిని భర్త దాడి చేయటాన్ని తెదేపా అభ్యర్థిని ఉషారాణి ఖండించారు. శాంతియుతంగా జరుగుతున్న ఎన్నికలలో వైకాపా అభ్యర్థిని భర్త రాజశేఖర్.. ఓటర్లపై దాడి చేసి గాయపరచటంపై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాల, బోయపాటి పాఠశాల పోలింగ్ బూత్ల వద్ద వైకాపా దాడులు జరిగాయని ఆరోపించారు. ఎన్నికలు నిష్పాక్షిపాతంగా జరిగేలా.. ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అతడిపై చర్యలు తీసుకోండి: తెదేపా అభ్యర్థిని - విజయవాడ మున్సిపల్ ఎన్నికలు న్యూస్
వైకాపా అభ్యర్థిని భర్త ఓటర్లపై దాడి చేయటాన్ని.. తెదేపా అభ్యర్థిని ఖండించారు. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెదేపా అభ్యర్థిని