వరలక్ష్మీదేవిగా.. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ.
కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ, వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణమాస రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసారు. వరలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.