కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వైద్యం చేయడం లేదని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు కృష్ణా జిల్లా నూజీవీడులోని వెంకటేశ్వర నర్సింగ్ హోంలో తనిఖీలు చేపట్టారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తూ.. బంధువులను బాధితుడి గదిలోకి అనుమతిస్తుండండతో పాటు.. కరోనా బాధితుడి వివరాలు సరిగా నమోదు చేయలేదనే ఆరోపణలతో తనిఖీ నిర్వహించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు - విజిలెన్స్ దాడులు నూజివీడు
కృష్ణా జిల్లా నూజివీడులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సరైన వివరాలు నమోదు చేయలేదన్న ఆరోపణపై తనిఖీలు చేపట్టారు.
vigilence raids on private hospitals