కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించకుండా పరికరాలు కొన్నట్లు గుర్తించారు. ట్రిపుల్‌ఐటీలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చిన అధికారులు... నిబంధనలు పాటించకుండా ఒప్పంద ఉద్యోగులను నియమించినట్లు గుర్తించారు. వసతిగృహంలోని 3 మెస్‌లలో ఆహార పంపిణీలో నాణ్యత లోపం, సమీపంలో మురుగునీరు ప్రవహించడంపై సిబ్బందిని ప్రశ్నించారు. ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లు సహా... మరికొన్ని విషయాలపై విచారణ కొనసాగిస్తున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. గతంలో పనిచేసిన ఉద్యోగుల ప్రమేయంపైనా అధికారుల ఆరా తీశారు.
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు - Irregularities in equipment purchases have been identified in nuziveedu iiit
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. గతంలో పనిచేసిన ఉద్యోగుల ప్రమేయంపై విచారణ చేస్తున్నారు.

నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు