ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో విజిలెన్స్ దాడులు - vijayawada updates

కృష్ణా జిల్లాలోని పలు ఆసుపత్రులపై విజిలెన్స్, వైద్య అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సను పరిశీలించారు. కొన్ని ఆసుపత్రులకు అనుమతులు లేకున్న కొవిడ్ బాధితులకు చికిత్సను అందిస్తున్నట్లు గుర్తించారు.

vigilance raids on covid haspitals
విజిలెన్స్ దాడులు

By

Published : Apr 27, 2021, 10:51 PM IST

విజయవాడ ఆటోనగర్ వద్దనున్న లిబర్టీ హాస్పిటల్​పై విజిలెన్స్​, వైద్య అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్​లో కొవిడ్ చికిత్సను అందిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం రోగుల నుంచి వైద్యం గురించి ఆరా తీశారు. మరో బృందం నూజివీడులోని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్​లో ఆకస్మిక దాడులు చేయగా సదరు ఆసుపత్రులకు కొవిడ్ వైద్యానికి అనుమతులు లేకున్న చేస్తున్నారని గుర్తించారు. రోగితో వచ్చిన వారిని వారి రూంలోకి అనుమతిస్తున్నారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details