కృష్ణాజిల్లా గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించి .. ఆసుపత్రిపై సెక్షన్ 420, 188 కింద కేసు నమోదు చేశారు. ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కొవిడ్ బాధితుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని… బాధిత కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అత్యధికంగా 9 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం తమను డిమాండ్ చేస్తుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేగాక జీవనాధారమైన లారీలు, వ్యక్తిగత వాహనాలను స్వాధీనం చేసుకున్నారని వాపోయారు.
గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిపై కేసు నమోదు - గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
కొవిడ్ చికిత్సల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో .. కృష్ణాజిల్లా గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించి .. ఆసుపత్రిపై సెక్షన్ 420, 188 కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే, అత్యధికంగా 9 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిలెన్స్ దాడులు
Last Updated : May 21, 2021, 12:59 PM IST