అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - Vigilance officers seized ration rice lorry news
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని కృష్ణాజిల్లా నందిగామలో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం నుంచి యానాంకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాజా సత్యం అనే వ్యాపారికి చెందినదిగా గుర్తించారు. స్థానిక పోలీస్స్టేషన్లో విజిలెన్స్ అధికారులు లారీని అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.