కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో అతమామలను హత్య చేసిన గ్రామ వాలంటీర్ నెమలి బాబు, అతని భార్య మనీషాను పోలీసులు అరెస్టు చేశారు. కట్నం కోసం, అత్తమామల్ని నెమలిబాబు వేధించేవాడని.. చాలాసార్లు పంచయితీలు కూడా జరిగాయని నందిగామ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు. తీరా కట్నం ఇంకా ఇవ్వకపోవటంతో ఈ నెల 15న తెల్లవారుజామున వృద్ధులు నిద్రిస్తున్న సమయంలో.. తమతో తెచ్చుకున్న కత్తితో పొడిచారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి:
వృద్ధ దంపతుల హత్య కేసులో వాలంటీర్ అరెస్ట్ - జగ్గయ్యపేట తాజా వార్తల
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ కాలనీలో వృద్ధ దంపతుల హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు... నందిగామ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు. ఈ నెల15న వృద్ధులకు హత్య చేసిన గ్రామ వాలంటీర్, అతని భార్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు డీఎస్పీ వివరించారు.
వృద్ధ దంపతుల హత్య కేసులో నిందితుల అరెస్ట్