ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్జీవోస్ స్థలాలపై అధికార పార్టీ నేతల కన్ను : శ్రీరాం తాతయ్య - Jaggayyapeta latest news

గతంలో ఎన్జీవోస్ కు ప్రభుత్వం ఇచ్చిన స్థలములను... కొందరు అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. దీని పై న్యాయ విచారణ జరిపే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తెలిపారు.

Ruling party leaders occupying Ngos places
ఎన్జీవోస్ స్థలములను ఆక్రమిస్తున్న అధికార పార్టీ నేతలు

By

Published : Nov 19, 2020, 2:48 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణం డాంగే నగర్ ఎన్జీవోస్ కాలనీ లో ఉద్యోగస్తులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను... అధికార పార్టీకి చెందిన కొందరు రాజకీయ నేతలు ఆక్రమించారని బాధితులు వాపోతున్నారు. 1981లో అప్పటి ప్రభుత్వం ఈ ఇళ్ల స్థలాలను ఇవ్వగా ఆర్థిక కారణాలతో కొందరు నిర్మించుకొలేక పోయారు. దీన్ని అదునుగా తీసుకున్న కొంత మంది అధికార పార్టీ నేతలు దొంగ పటాలను సృష్టించి వాటిని ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకొంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అండతో కొందరు దుండగులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని...దీంతో నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారని తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఈ విషయంపై న్యాయ విచారణ కొరకు తహసీల్దార్ , కలెక్టర్​కు అర్జీలు అందజేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details