ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరు ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా - ఏలూరుకు కేంద్ర వైద్య బృందం తాజావార్తలు

అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులకు వస్తున్న ఏలూరు ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఏలూరులో పలువురు అధికారులతో మాట్లాడిన ఆయన.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో చర్చించారు. ఉపరాష్ట్రపతి చొరవతో ఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన వైద్య నిపుణులు, వైరాలజిస్టుల బృందం ఏలూరుకు వచ్చి, ల్యాబ్ నివేదికలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందజేయనున్నారు.

vice president venkaih naidu
ఏలూరు ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

By

Published : Dec 8, 2020, 7:59 AM IST



ఏలూరు నగరంలో అంతుచిక్కని వ్యాధి సృష్టిస్తున్న అయోమయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక వైద్యులతోపాటు మంగళగిరి ఎయిమ్స్ వైద్య బృందం పరిశీలించారని.. అయితే వైద్య పరీక్షల్లో ఈ పరిస్థితికి కారణమేంటనేది మాత్రం తెలియడం లేదని అధికారులు ఉపరాష్ట్రపతికి తెలియజేశారు.

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో ఉపరాష్ట్రపతి..
ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో ఉపరాష్ట్రపతి చర్చించారు. బాధితులకు ఉన్నతస్థాయి వైద్యం అందించటంతోపాటు.. ఘటనకు కారణమేంటనే దాన్ని గుర్తించి.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించాలని, ప్రత్యేక చొరవతీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ముగ్గురు వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏయిమ్స్ అత్యవసరవైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్, పుణే ఎన్ఐవీ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ దేవష్టవర్, ఎన్డీసీసీ డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్ సంకేత్ కులకర్ణిలతో కూడిన ఈ బృందం.. ఏలూరు వైద్యులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అంతుచిక్కని వైనం..
ఏలూరులో నాలుగైదు రోజులుగా పలువురు మూర్ఛ, కళ్లుతిరగడం, నోట్లు నురగ రావటం వంటి లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. రెండు రోజుల చికిత్స అనంతరం కోలుకొని ఇంటికి వెళ్తున్నారు. ఒక్కసారిగా కేసుల తీవ్రత పెరగటం.. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళల ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే ఇది సంక్రమణ వ్యాధి కాదని ప్రాథమిక అంచనాకు వచ్చిన వైద్యులు.. అసలు కారణాలు తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి...

నేడు ఏలూరుకు కేంద్రం బృందం రాక

ABOUT THE AUTHOR

...view details